పండగలా జరిగిన ప్రమాణ స్వీకారం… శుభాకాంక్షలు తెలిపిన కొండూరి…

IMG-20190206-WA0316సర్పంచ్ గా ఘన విజయం సాధించిన వెంకట్ రెడ్డికి “తెలంగాణ రిపోర్టర్“(ప్రతినిధి)  శుభాకాంక్షలు 

రాజన్న సిరిసిల్ల జిల్లా, టి రిపోర్టర్(సంపత్ పంజ):-

**************************************

IMG-20190206-WA0308

ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఘన విజయం సాధించిన నెవూరి వెంకట్ రెడ్డి బుధవారం రోజున ప్రజల, గ్రామపంచాయతీ అధికారుల, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

IMG-20190206-WA0307

వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. గ్రామ సర్పంచిగా మొదటి రోజు గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం పై చర్యలు చేపట్టాడానికి అధికారికంగా మొదటి సంతకం చేశారు.

IMG-20190206-WA0309

ఈ కార్యక్రమానికి టెస్కబ్ చైర్మన్ రవీందర్ రావు హాజరయ్యారు.

IMG-20190206-WA0305

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

గతంలో వెంకట్ రెడ్డి సతీమణి మమతా చేసిన సేవలు గుర్తించిన ప్రజలు వెంకట్ రెడ్డికి తిరిగి విజయం అందించి నందుకు ఎల్లారెడ్డిపేట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వెంకట్ రెడ్డి ని అభినందించారు.

ఇది ఎల్లారెడ్డిపేట్ ప్రజల విజయం అని,గ్రామ అభివృద్ధి కి అందరం సహకరిస్తామని తెలిపారు.నాలుగున్నర సంవత్సరాల్లో కె టి రామారావు ఆధ్వర్యంలో గత 70 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధి జరిగింది అని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి 6000  కోట్లు నిధులు వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కె టి ఆర్ సహకారంతో మేమందరం వెంకట్ రెడ్డి కి సహకరించి ఎల్లారెడ్డిపేట్ మండలాన్ని ,గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే విదంగా కృషి చరిస్తామని అన్నారు.

IMG-20190206-WA0306

సర్పంచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి క్షేణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని,ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని ప్రజల సంక్షేమం లో హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నర్సింగ రావు, చక్రపాణి,స్థానిక ఎం పి టి సి ఒగ్గు బాలరాజు,ఉప సర్పంచ్ రజిత,వార్డ్ సభ్యులు,వివిధ మండలంలోని ,గ్రామాల్లోని నాయకులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు….