పవన్ కళ్యాణ్ పై అలిగిన కీర్తి సురేష్!!!!…

టైటిల్ చూసి కంగారు పడకండి. ఇది సినిమాలో. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి, ఈ సినిమా నుండి గాలి వాలుగా అనే పాట నిన్న విడుదల అయ్యింది. ఈ పాటసిట్యువేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ పాటకు ముందు కీర్తి సురేష్ పవన్ పై అలుగుతుందట. అప్పుడు పవన్ ఆమెను కూల్ చేయడానికి ఈ పాట పాడుతాడని తెలిసింది. త్రివిక్రమ్ సినిమాల్లో అలిగిన ప్రేయసిని కూల్ చేసే పాటలు భలే సరదా వుంటాయి. ఇప్పుడీ పాట కూడా భలే వుంద.

ఈ పాట లిరిక్స్ ఇలా సాగాయి..
కోర కోర కోపమేలా
చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోన, అంత ఉడికిస్తే
అరె అని జాలిపడవే పాపం కదే ప్రేయసి
సరే అని చల్ల బడవే ఓసి పిశాచి
మొహం అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి

ఎన్నాళ్లికా ఒరికే ఊహల్లో
వుంటాం పెంకి పెళ్లి
చాల్లే ఇంకా మానుకో
ముందు వెనుక చూసుకొని పంతం

ఆలోచిద్దాం చక్కగా కూర్చొని
చర్చిద్దాం చాలు యుద్ధం
రాజీకొద్దాం కొద్దిగా కలిసోస్తే
నీకేమిటంట కష్టం