పెద్దపల్లిలో 65 శాతం పోలింగ్

IMG-20190411-WA0084www.telaganareporter.news✍9394328296..

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 

👉పెద్దపల్లి పార్లమెంట్ లో 65.22 శాతం పోలింగ్..

పెద్దపల్లి జిల్లా, ఏప్రిల్-11, తెలంగాణ రిపోర్టర్:-పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది..పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గంలో 65.22 శాతం పోలింగ్ జరిగింది.. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయంలో జిల్లా కలెక్టర్ గోదావరిఖనిలో సెయింట్ పేయిటర్ స్కూల్ లో ఎర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య 50 లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కోసం చేసిన ఎర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పెద్దపల్లిలోని రిక్రియెషన్ క్లబ్ లో జిల్లా సంయుక్త పాలనాధికారి వనజాదేవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎర్పాటు చేసిన సఖీ పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

IMG-20190411-WA0062

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, డిసిపి రక్షిత కె మూర్తి, పార్లమెంట్ టిఆర్ఏస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్, పలువురు ప్రముఖులు నియోజకవర్గంలో ఓటు హక్కు ను వినియోగించుకొన్నారు..

IMG-20190411-WA0041

పెద్దపల్లి పార్లమెంటు లో..

చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 225 పోలింగ్ కేంద్రాలలో 1,75,513 మంది ఒటర్లకు గాను 1,02,535(58.42%) , బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 222 పొలింగ్ కేంద్రాలలో 1,64,275 మంది ఓటర్లకు గాను 1,04,512(64.71%), మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 277 పోలింగ్ కేంద్రాలలో 2,50,211 మంది ఓటర్లకు గాను 1,35,189(54.03%), ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 269 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,18,484 మంది ఓటర్లకు గాను 1,30,260(6305%), రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 259 పోలింగ్ కేంద్రాలలో 2,12,197 మంది ఓటర్లకు గాను 1,03,977 మంది ఓటర్లు (57.49%), మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 288 పోలింగ్ కేంద్రాలలో 2,20,129 మంది ఓటర్లకు గాను 1,28,225 (58.25%) , పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 287 పోలింగ్ కేంద్రాలలో 2,37,253 మంది ఓటర్లకు గాను 1,25,744(59.4%) మంది ఓటర్లు సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

IMG-20190411-WA0082

పోలింగ్ శాతం 65..

పెద్దపల్లి పార్లమెంట్ పరిధలో సాయంత్రం 5 గంటల వరకు 59.24 శాతం పోలింగ్ నమోదు అయిందని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 1827 పోలింగ్ కేంద్రాలలో 14,78,062 మంది ఒటర్లు ఉండగా, ఇప్పటి వరకు 8,36,034 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించామని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం మేర 65 శాతం ఓటింగ్ నమోదు కావడం జరిగింది..

IMG-20190411-WA0085

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.. జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన..

పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎం యంత్రాలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సీజ్ చేసి రిసేప్షన్ సెంటర్ కు తరలించడం జరుగుతుందన్నారు. బందెంపల్లి గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపడం నిరసిస్తూ ఆ గ్రామ ప్రజలు పోలింగ్ కు దూరంగా ఉన్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ వ్యాప్తంగా మాక్ పోల్ నిర్వహిస్తున్న సమయంలో 32 బ్యాలేట్ యూనిట్లు, 49 కంట్రొల్ యూనిట్లు, 62 వివిప్యాట్లు , పోలింగ్ జరుగుతున్న సమయంలో 32 బ్యాలేట్ యూనిట్లు, 17 కంట్రోల్ యూనిట్లు, 95 వివిప్యాట్లు మొత్తం 64 బ్యాలేట్ యూనిట్లు, 66 కంట్రోల్ యూనిట్లు, 157 వివిప్యాట్లు వివిధ సాంకేతిక కారణాల వల్ల మరమ్మత్తులకు గురికాగా వెనువెంటనే సంబంధిత సెక్టోరల్ అధికారులు ఈవిఎంలను రిప్లెస్ చేసి పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ వ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జర్గకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. ….

————–  – — ——————-

👉న్యూస్ from..తెలంగాణ రిపోర్టర్:-✍(దినేష్)..9394328296

‪+91 93943 28296‬ 20190208_141923