పేకాట క్లబ్ లపై పోలీసుల దాడులు

www.telaganareporter.news✍9394328296..Screenshot_2019-06-03-00-32-13-402

రామగుండం కమిషనరేట్ లో పేకాట క్లబ్ లపై పోలీసుల దాడులు..
👉ఖనిలో మాజీమంత్రి ఇంటిపై పోలీసుల దాడులు..పేకాటాడుతున్న పలువురి అరెస్టు..

👉అసాంఘిక కార్యకాలాపాలపై సిపి దృష్టి.. హర్షం వ్యక్తం చేస్తున్న కమిషనరేట్ ప్రజలు..

రామగుండం కమిషనరేట్, జూన్ -3, తెలంగాణ రిపోర్టర్:-(దినేష్..✍) :- రామగుండం కమిషనరేట్ పరిధిలో పేకాట క్లబ్బుల పై పోలీసులు దాడులు జరిపారు.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్ పై పోలీస్ దాడులు…36 మంది పేకాట ఆడుతున్న వారి నుండి 6 లక్షల 21 వెయ్యి రూపాయలు …
237 టోకెన్లు స్వాధీనం చేసుకొన్నారు..

Screenshot_2019-06-03-00-35-27-421
అలాగే రామగుండం కమీషనేరట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉంటున్ మాజీ మంత్రి మాంతంగి నర్సయ్య ఇంటి పై రామగుండం కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ & లా & ఆర్డర్ పోలీసుల దాడులు ,సోదాలు నిర్వహించి పేకాట ఆడుతున్న పలువురిని పట్టుకున్నారు..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పేకాట స్థావరం మాజీ మంత్రి మాతంగి నర్సయ్య ఇంటి పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నాదెండ్ల భాస్కరరావు హయాంలో మంత్రిగా పనిచేసిన నర్సయ్య ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో స్థానికంగా సంచలనం కలిగింది. న్యాయవాది, మాజీ ప్రజా ప్రతినిధి కావడంతో పోలీసు అధికారులు ఎవరు కూడా మాజీ మంత్రి ఇంటిపై కన్నెత్తి చూడకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా పేకాట మూడు పత్తాలు, ఆరు రమ్మీ లుగా కొనసాగుతుంది. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశంతో పేకాట ఆడుతున్న ఆరుగురితో పాటు 27 వేల నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారులను మాజీ మంత్రి నీఅంతు చూస్తానని ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తారో చూస్తానని బెదిరించడంతో పోలీసుల ను షాక్ కు గురి చేసింది.

Screenshot_2019-06-03-00-36-00-411ఈ దాడుల్లో కమిషనరేట్ పోలీసులు పాల్గొన్నారు..ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలపై సిపి సత్యనారాయణ దృష్టి సారించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..