ప్రజల దాహార్తిని తీర్చుతున్న సర్పంచ్ ని అభినందించిన ఎమ్మెల్యే లు..సుమన్,చెందర్…

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-

IMG-20190314-WA0346

ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామపంచాయతీ లో వేసవి కాలం తాకిడికి నీటి ఎద్దడి ఉండటం వలన స్పందించిన ఎల్లారెడ్డిపేట్ సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి తన తల్లిదండ్రుల స్మరకార్థం ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

IMG-20190314-WA0347

ఇట్టి ప్రజా శ్రేయస్సు కోరే కార్యక్రమన్నీ చెన్నూరు, రామగుండం ఎమ్మెల్యే లు బాల్క సుమన్,కోరుకంటి చెందర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చుతూ నీటి ఎద్దడిని అధిగమిస్తున్న సర్పంచ్ వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట్ ప్రజలకు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టం అని సర్పంచ్ వెంకట్ రెడ్డి ని అభినందించారు. ఈ లాంటి కార్యక్రమాలు చేయడానికి సర్పంచు కు తోడుగా అందరూ ముందుకు రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట్ మాజీ సర్పంచ్ మమత,మహిళలు,తదితరులు పాల్గొన్నారు..