ప్రభుత్వ పరంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు: జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి…

రాజన్న సిరిసిల్ల జిల్లా, టి.aరిపోర్టర్(సంపత్ పంజ):-
11 ఏప్రిల్ 2019:


భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను జిల్లా కేంద్రం సిరిసిల్ల లో ఈ నెల 14 వ తేదీన ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు.

IMG-20190412-WA0374

సిరిసిల్ల పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కూడలిలో ఆదివారం ఉదయం 09.00 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. కేంద్రం ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు . డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలకు ప్రజలందరూ ఆహ్వానితులే నని కలెక్టర్ పేర్కొన్నారు . అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఈ వేడుకలు తప్పనిసరిగా హాజరవ్వాలని కలెక్టర్ ఆదేశించారు .

ప్రజా సంఘాల ప్రతినిధులు , ప్రజలందరూ సకాలంలో వేడుకలు హాజరై వేడుకలను జయప్రదం చేయాలన్నారు .

వేడుకలు జయప్రదం కు 7 గురు ప్రత్యేక అధికారులు

సిరిసిల్ల పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కూడలిలో ఈ నెల 14 వ తేదీన ప్రభుత్వ పరంగా నిర్వహించున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ 7 గురు అధికారులును ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు . ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు .

ఆర్ డి ఓ టి శ్రీనివాస్ రావు ను , జిల్లా ఎస్సి సంక్షేమ అభివృద్ధి అధికారి రాజేశ్వరిని జయంతి వేడుకలు బాధ్యులు గా నియమించారు . అలాగే లా అండ్ అండ్ ఆర్డర్ బాధ్యతలను డి ఎస్ పి ఎన్ వెంకట రమణ కు అప్పగించారు . డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రతిమ , ఐలాండ్ అలంకరణ బాధ్యతను సిరిసిల్ల పురపాలకసంఘ కమిషనర్ కెవి రమణాచారి కి , సమన్వయ బాధ్యతలు జిల్లా పంచాయితీ రాజు ఇంజనీరు వి కనక రత్నం , జిల్లా మైనింగ్ అధికారి సైదులుకు , వేదిక అలంకరణ బాధ్యత అటవీ శాఖ రేంజ్ అధికారి కె అనిత కు అప్పగించారు .