ప్రమాదకరంగా రోడ్డు ప్రక్కనే ఎండిన చెట్టు…తొలగించాలని కోరుతున్న ప్రజలు

చిగురుమామిడి, మార్చి 15: M.Kanakaiah, telanganareporter.news


చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామ సమీపంలో… స్కూల్ దగ్గర పురాతనమైన ఎండిన చెట్టు ప్రమాదకరంగా ఉండి, కూలడానికి ఉంది.

IMG-20190315-WA0605

ప్రతినిత్యం స్కూల్ పిల్లలు హుస్నాబాద్ వెళ్లే ప్రదాన రహదారి ఇది.

ఈ చెట్టు నీడన ఎవరైనా నిలబడాలంటే భయం భయంగా నిల్చుంటారు. ఎప్పుడూ పడిపోతుందో అని స్కూల్ పిల్లల ప్రయాణికులు భయపడుతుంటారు.

ఈ పరిస్థితుల్లో, ఈ చెట్టును పరిశీలించి, తొలగించాలనీ, అక్కడ నీడనిచ్చే మరో మ్రొక్కను నాటాలని సంబంధిత అధికారులను ఈ ప్రాంత ప్రజలు, పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.