ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు

రామోజీరావు :

చెరుకూరి రామోజీరావు భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు మరియు ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనములో ప్రపంచములోనే అతిపెద్ద సినిమా స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఈ ఫిల్మ్ సిటీ హైదరాబాదు నగర శివార్లలో హైదరాబాదు – విజయవాడ రహదారిపై హయాత్ నగర్ వద్ద ఉంది.

జీవితం :
రామోజీరావు గుడివాడ, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 16 నవంబర్ , 1936 తారీఖున ఒక రైతు కుటుంబములో జన్మించాడు. తల్లి: వెంకట సుబ్బమ్మ తండ్రి: వెంకట సుబ్బారావు. వీరి ముత్తాత పామర్రు మండలం పెరిశేపల్లి గ్రామంనుండి వలస వెళ్ళారు. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థలలో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కళాంజలి షోరూములు మొదలైనవి ముఖ్యమైనవి.
ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు

జననం – చెరుకూరి రామోజీరావు
నవంబరు 16, 1936 (వయస్సు: 81 సంవత్సరాలు)
గుడివాడ,కృష్ణా జిల్లా

నివాస ప్రాంతం హైదరాబాదు

ఇతర పేర్లు- రామోజీ
వృత్తి – పత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
ప్రసిద్ధి – పత్రికాధిపతి
మతం – హిందూ
భార్య / భర్త – రమాదేవి
పిల్లలు – కిరణ్, సుమన్

వ్యాపారాలు
రామోజీ ఫిల్మ్ సిటీ
మీడియా
*ఈనాడు, న్యూస్ టైమ్ (కొంతకాలం)
*వసుంధర పబ్లికేషన్స్: సితార, చతుర, విపుల, అన్నదాత, తెలుగువెలుగు, బాలభారతం
*ఈ టివి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియ, గుజరాతీ, బీహార్
*రామోజీ ఫిల్మ్ సిటీ
*ఉషా కిరణ్ మూవీస్

ఆర్థిక సేవలు
*మార్గదర్శి చిట్ ఫండ్స్

ఇతరాలు
*కళాంజలి – సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
*బ్రిసా – ఆధునిక వస్త్రాలు
*ప్రియా ఫుడ్స్ – పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
*డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
*కొలోరమ ప్రింటర్స్

నిర్మించిన సినిమాలు

శ్రీవారికి ప్రేమలేఖ (1984)
మయూరి (1985)
మౌన పోరాటం (1989)
ప్రతిఘటన (1987)
పీపుల్స్ ఎన్ కౌంటర్ (1991)
చిత్రం (2000)
మెకానిక్ మామయ్య
ఇష్టం (2001)
నువ్వే కావాలి (2000)
ఆనందం (2001)
ఆకాశ వీధిలో (2001)
మూడుముక్కలాట
నిన్ను చూడాలని (2001)
తుఝె మేరీ కసమ్
వీధి (2005)
నచ్చావులే (2008)
నిన్ను కలిసాక (2009)
సవారి (కన్నద గమ్యమ్) (2009)

పద్మపురస్కారం
ఇతనికి 2016 సంవత్సరానికి గాను సాహిత్యం మరియు విద్య విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.

పురస్కారాలు/గౌరవాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు
యుధవీర్ అవార్దు
కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి (రాజస్తాన్) అవార్డు
బి. డి. గోయెంకా అవార్డు
పద్మవిభూషణ్ (2016 సాహిత్యం, విద్య విభాగాలలో)
maxresdefault (1)