ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం!!!….

ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం

మాజీ మిస్‌ వరల్డ్‌, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా మదర్‌ థెరిసా మెమోరియల్‌ అవార్డు అందుకున్నారు. యూనిసెఫ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రియాంక హాలీవుడ్‌ మూవీలతో ఫారెన్‌లో బిజీగా ఉండడంతో ఆమె తల్లి మధు చోప్రా ఈ జ్ఞాపికను అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రియాంక లాంటి కూతురును కన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. మనం ఇతరులకు ఎంత సాయం చేస్తే అంతకంటే ఎక్కువ మనకు తిరిగి లభిస్తుందనడానికి ప్రియాంకనే నిలువెత్తు నిదర్శమని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ప్రియాంకకు చిన్నప్పటి నుంచి థెరిసా అంటే చాలా ఇష్టమని, ఆమె స్ఫూర్తితోనే పలు సామాజిక కార్యక్రమాల్లో తన వంతు సాయం చేస్తున్న చోప్రా ఈ అవార్డుకు అర్హురాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ఎ కిడ్‌ లైక్‌ జేక్‌. ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.