అందరి ఆశలు అడియాసలై, బంగరు తెలంగాణ నినాదం కేవలం అధికార పార్టీలోని ఒక్క కుటుంబానికే పరిమితమైంది: జగిత్యాల జిల్లా బిజెపి

  • ssssజగిత్యాల జిల్లా : తేది: 21- 04 – 2019, sircilla srinivas, 9849162111, telanganareporter.news      ✍:

భారతీయ జనతా పార్టీ… జగిత్యాల జిల్లా శాఖ కార్య వర్గ సమావేశం ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్స్ లో జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అధ్యక్షతన జరిగింది.


IMG-20190421-WA0541__01 ఈ సందర్భంగా, రాజకీయ-విద్యా-రైతాంగ సమస్యలపై రాజకీయ తీర్మానం చేసి, ఆమోదించారు.

IMG-20190421-WA0535__01

రాజకీయ తీర్మానం:

నా తెలంగాణ కోటి రతనాల వీణ..అంటూ…తెలంగాణ ప్రజల మేధావుల, యువకుల, కళాకారులు, విద్యార్థులు, కార్మిక, కర్షక, ఉద్యోగుల ఆకాంక్షలు- ఆశయాలన్నీ కూడా… మన నీళ్లు  –  మన నిధులు – మన ఉద్యోగాలు మాత్రమే.

IMG-20190421-WA0542__01

ఈ ఆశలు, ఆకాంక్షల సమ్మేళన ఫలితమే..భారతీయ జనతా పార్టీ తో సహా అన్ని రాజకీయ పార్టీల సమిష్టి కృషియే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నది నగ్న సత్యం…

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో మన రాష్ట్రం సుభిక్షముగా ఉంటుందనీ, మన భవిష్యత్తు బంగారు మయం అవుతుందని…అనుకున్న అందరి ఆశలు అడియాసలై, బంగరు తెలంగాణ నినాదం కేవలం అధికార పార్టీలోని ఒక్క కుటుంబానికే పరిమితమైంది…

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, ఐదు సంవత్సరాల కాలంలో తమ ఇష్టానుసారంగా, అధికార దర్పంతో చేస్తున్న కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు , రైతులు, యువకులు, విద్యార్థుల ఆశలు అడియాసలై, మరో తిరుగుబాటుకు సిధ్దమవుతూ, నిశ్శబ్ద విప్లవం వైపు అడుగులేస్తున్న పరిస్థితులను జగిత్యాల జిల్లా ప్రజల ముందుంచాలన్న పార్టీ నిర్ణయం మేరకు,  భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ,  జిల్లా కార్యవర్గ సమావేశంలో గావించిన రాజకీయ తీర్మాణమిది…

* “మా నీళ్లు మాకొస్తాయి” అని కలలు గన్న రైతాంగం అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా భూప్రక్చాలన పేరిట అధికారులకు కోట్లాది రూపాయలు ముడుపులందడం తప్ప, కనీసం 50 శాతం ఐనా ప్రభుత్వం,పప్రజలు ఆశించిన లక్ష్యం నెరవేరలేదన్నది, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్న మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

* ప్రకృతి వైపరీత్యంతో, వడగళ్ల వానతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నష్టపోతే, కనీసం నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు తప్ప మరేమీలేవని బిజెపి భావిస్తోంది.

* అధికారం చేపట్టిన వంద రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న హామీ, పసుపు, ఎర్రజొన్న పంటలకు మధ్దతు ధర , పంటపొలాలకు శ్రీరాం సాగర్ నీరందించే విషయంలో ప్రభుత్వ ప్రకటనల వైఫల్యమే…నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలలో మూకుమ్మడిగా 170 మందికి పైగా రైతులు సంఘటితమై పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడమే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం..

* ఇక, అరచేతిలో బెల్లం పెట్టి, మోచేతితో…” అన్నట్లుగా, భూమి ఉన్న రైతులు ఎవరైనా సరే, ఎకరానికి ఒక పంటకు 4 వేల రూపాయల “తాయిలం” ఇచ్చి, శ్రీరాంసాగర్ నీటిని గజ్వెల్ కు తరలించడంను రైతాంగం పాలిట శాపంగా బిజెపి భావిస్తుంది.

* తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు “తాము చెప్పిందే వేదం ” అన్నట్లుగా వ్యవహరిస్తూ, అనేక అక్రమాలకు పాల్పడుతూ,ఉదద్యమ ఆకాంక్ష లను విస్మరించి.. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీ గా మారింది.

ప్రధానంగా, ప్రజాస్వామ్య వ్యవస్థకు “పట్టు కొమ్మ” లైన పత్రికా వ్యవస్థ ను సైతం బేఖాతరు చేస్తూ..అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి జగిత్యాల లో రాత్రి సమయంలో ఈవిఎం ల తరలింపు అంశంలో పత్రికా విలేఖరులపై కేసులు బనాయించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటూ, పత్రికా విలేఖరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.

* తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అమోఘం అంటూనే, విద్యార్థుల భవితవ్యాన్ని మంటగలిపే రీతిలో , ఇంటర్ బోర్డు వ్యవహరిస్తూ…విద్యార్థుల జీవితాలతో , తల్లితండ్రుల ఆశలతో ఆడుకుంటూ, ఎందరో విద్యార్థుల బలవర్మణాలకు కారణమౌతుందనీ, ప్రభుత్వమే బాధ్యత వహించి, వారి వారి తల్లితండ్రులకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని జిల్లా బిజెపి శాఖ డిమాండ్ చేస్తుంది.

* నాడు ఆంధ్ర పాలకుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు బలవన్మర ణాలు చెందితే, మనందరం సంఘటితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పిదాల మూలంగా , ఇంటర్ విద్యార్థులు ఎందరో బలవన్మర ణాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం…కన్న తల్లులకు కడుపు కోత మిగుల్చుతున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాము.

* ఇల్లు లేని వారు తెలంగాణ రాష్ట్రం లో ఉండరాదు..అందరికీ ఇల్లు..నినాదంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” డబుల్ బెడ్ రూం ” పథకం ప్రకటనలకే పరిమితమైంది…

జగిత్యాల జిల్లా కేంద్రంలో  :

* ఉద్యమాలకు పుట్టినిల్లయిన జగిత్యాల జిల్లా కేంద్రంలో సంవత్సరాల తరబడి నెలకొన్న సమస్యల పరిష్కారములో జగిత్యాల జనం అధికార పార్టీ పై పెట్టుకున్న ఆశలు వమ్మయిపోయాయి…

* ప్రధానంగా ప్రతినిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కనుగుణంగా, రోడ్డు ప్రమాదాల నివారణకై, యావర్ రోడ్డు వెడల్పు అంశంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందడాన్ని తీవ్రంగా ఖండిస్తూ…రోడ్డు వెడల్పు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.

* జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, ఆసుపత్రి ఆధునీకరణలో వైఫల్యం చెంది, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంను ఖండిస్తున్నాము.

* సాగు – త్రాగు నీరు పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామంటున్న ప్రభుత్వం శ్రీ రాం సాగర్ నీటిని సిద్దిపేట, గజ్వెల్ కు తరలించకుండా, గ్రామ గ్రామాన త్రాగునీటి సమస్యను తీర్చాలని జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.