బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

Dharmapuri Lakshmi Narasimha1

ధర్మపురి మార్చి 6, తెలంగాణ రిపోర్టర్ ,డా.మధు మహదేవ్ శర్మ


ఈ నెల 15 నుంచి 29 వరకు జరిగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్  డాక్టర్ శరత్  అన్నారు.

IMG-20190306-WA0823

బుధవారం ధర్మపురి ఓల్డ్ టీటీడీలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శరత్   మాట్లాడుతూ 13 రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల జాతర లో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కావలసిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ అధికారులతో భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలతో ఆరా తీశారు. ప్రతి బస్సు ఎక్కడికి వెళుతుంది అనే సమాచారం తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

వేసవి దృష్ట్యా బస్టాండ్ లో చలువపందిళ్లు, చలివేంద్రంల ఏర్పాట్లు చేయాలని, ఇతర సౌకర్యాల పై దృష్టి పెట్టాలని సూచించారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం అందుబాటులో ఉండేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య శిబిరాల లో 24 గంటలు డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అవసరమైన అన్ని మందులు నిల్వ ఉంచుకోవాలని గ్లూకోజ్ ప్యాకెట్లను విరివిగా భక్తులకు అందించాలని అన్నారు.

అత్యవసర సేవలకై 108 అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని, వైద్య శాఖకు సూచించారు.

జాతర సమయంలో నిరంతర విద్యుత్ ఏర్పాటుకై వీధిలైట్లు ఫ్లడ్లైట్లు ఏర్పాటు దేవాలయము విద్యుదీకరణ చడంలో అలంకరణ చేయడంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రథం తిరిగే సమయంలో విద్యుత్ తీగలు అడ్డురాకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

పట్టణ పారిశుధ్యానికి, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించాలి మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం చేస్తే సహించమని హెచ్చరించారు.

దేవస్థానం కోనేరు ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లు పర్యవేక్షించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు.

కోనేరులో మంచి నీటిని నింపడానికి మిషన్ భగీరథ నీటిని వాడుకోవాలని తాగునీటికి కూడా భగీరథ నీటిని ఉపయోగించాలని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది కి సూచించారు.

పట్టణంలోని రోడ్లపై గుంతలను పూడ్చాలని, సమాచారం కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్, పి ఆర్ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరిలో స్నానం చేసే భక్తుల కోసం ప్రమాదం జరగకుండా మత్స్య శాఖ ఆధ్వర్యంలో 15 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ వారికి సూచించారు.

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం అన్ని హోటల్లో నాణ్యమైన భోజనం లభించేలా, ఒకే రకమైన రేట్లను నిర్ణయించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆదేశించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత భోజనం పాసులు, వివిఐపి పాసులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, స్వామి దర్శనానికి వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, సిసి కెమెరాలు ఏర్పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని సూచించారు .

అనంతరం జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైన ఏర్పాట్లను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేస్తామని ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని గుర్తించి, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు , భక్తుల రద్దీ దృష్ట్యా దొంగతనాలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛందంగా సేవ చేసే వారికి వాలంటీర్లకు అవసరమైతే శిక్షణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇస్తామని, భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రతాపరమైన ఏర్పాట్లను పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేస్తామని తెలిపారు.

అనంతరం దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వేసవి దృష్ట్యా చలువ పందిళ్ళ నిర్మాణం చేపట్టామని భక్తులకు ఉచిత అన్నదానం, స్వామివారి కళ్యాణం నిర్వహించే స్థలం తక్కువగా ఉన్నందున భక్తులు సహకరించాలని, గోదావరిలో మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తామని, గోదావరిలోకి వెళ్లలేని భక్తుల కోసం గోదావరి నుండి ప్రత్యేక పంపుల ద్వారా స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరేందర్, దేవస్థానం ఈవో, డిప్యూటీ కలెక్టర్ అమరేందర్, మండల తహసీల్దార్ వెంకట్ రెడ్డి,ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, ఎస్సై శ్రీకాంత్, దేవస్థానం సూపరిండెంట్ కిరణ్, స్థానిక నాయకులు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ధర్మపురి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇందారపు రామన్న, ఆయా శాఖల అధికారులు ఆలయ సిబ్బంది, అర్చకులు వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.