మట్కా నిర్వహిస్తున్న 27 మంది అరెస్ట్..

WWW.telaganareporter.news✍9394328296..IMG-20190601-WA0027

మట్కా నిర్వహిస్తున్న 27 మంది అరెస్ట్..
పరారీలో 10 మంది నిందితులు..
2.46 లక్షలు,18 సెల్ ఫోన్లు స్వాధీనం..

రామగుండం కమిషనరేట్, జూన్-1,తెలంగాణ రిపోర్టర్:  రామగుండం కమిషనరేట్ లో మట్కా నిర్వహిస్తున్న 27 మంది బిటర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుండి 2.46 లక్షల రూపాయలు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మట్కా నిర్వహిస్తున్న మరో 10 మంది ఇతర రాష్ట్రాల నిందితులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ నిందితుల వివరాలను వెల్లడించారు.

IMG-20190601-WA0030
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిదిలో 3 ముగ్గురు, జన్నారంలో 4గురు, బెల్లంపల్లిలో 6 గురు, శ్రీరాంపూర్ లో 1, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో 13 మందితో మొత్తం 27 మందిని కమిషనరేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు, వారి వద్ద 2.46 లక్షల నగదు, 18 సెల్ ఫోన్లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మట్కా నిర్వహిస్తున్న మరో 10 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులు పరారీలో ఉన్నట్లు సిపి తెలిపారు.

 

IMG-20190601-WA0028మట్కా ఆట మహారాష్ట్ర కేంద్రంగా నడుస్తోందని, ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబయ్, బల్లార్ష, వని, బోరి ప్రధాన కేంద్రాలుగా నడుస్తోoదన్నారు. సామాన్య ప్రజలు డబ్బు సంపాదించాలనే అత్యాశ కు పోయి, మట్కా కోసం అధిక వడ్డీలు చేసి, నష్టపోయి జీవితాలను చిద్రం చేసుకొంటున్నారన్నారు.వీరికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ , అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
రామగుండం కమిషనరేట్ లో మట్కా బంద్ అవుతోందని, ఎంతటి వారైనా మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాల పై బాగస్వాములయితే చట్టపరమైన చర్యలు ఉంటాయాన్నారు.. మట్కా నిర్వహించే వారితో సన్నిహిత సంబంధాలు మరియు ఇతర ఎన్ఫోర్స్మెంట్ తదితర ఉదాసీనత,పోలీస్ ఆపరేషన్ చేపట్టే విషయాలను లీక్ చేసిన 9 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు, వారిని విధుల నుండి తప్పించి విఆర్ లో పెట్టడం జరిగిందన్నారు.

,,-వారిలో (4)గురు టాస్క్ ఫోర్సు కి సంబంధించి , (3) గురు గోదావరిఖని I పోలీస్ స్టేషన్,(1) స్పెషల్ ఆపరేషన్ పిసి,సిపి ఆఫీస్*
1. సురేందర్ ,పిసి 646, టాస్క్ ఫోర్సు
2. ఎ.సదానందం పిసి 3158, టాస్క్ ఫోర్సు
3. చిప్ప. సదానందం పిసి 114, టాస్క్ ఫోర్సు
4. ఎన్ .కళ్యాణ్ పిసి 2511, టాస్క్ ఫోర్సు
5. రాజేందర్ పిసి 2900 , (స్పెషల్ ఆపరేషన్ పిసి,సిపి ఆఫీస్)
6. ఏఎస్ ఐ రాములు, 1880 గోదావరిఖని I పోలీస్ స్టేషన్
7. .ప్రభాకర్, పిసి , 2253 గోదావరిఖని I పోలీస్ స్టేషన్
8. రాధాకృష్ణ, పిసి ,29 గోదావరిఖని I పోలీస్ స్టేషన్
9. దుబాసి రమేష్ 131 రామగుండము పిఎస్
ఇప్పుడిప్పుడే ప్రజల మరియు వివిధ వర్గాల మన్ననలు పొందుతూన్న తెలంగాణా పోలీస్ వ్యవస్తకు తలవంపులు తెచ్చే వారెవ్వరిని కూడా ఉపేక్షించేది లేదని సిపి హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిసిపి సుదర్శన్ గౌడ్, ఏసీపీ ఉమెందర్, సంజీవ్,అశోకుమార్, రవికుమార్, సిఐ లు సాగర్, సరిలాల్, పర్స రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్కా నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ చేశారు.ఇక ముందు మట్కా నిర్వహిస్తే కఠిన చర్యలతో పాటు, అవసరమైతే పిడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు.