మరీ ఈ రేంజ్‌లో నా బాహుబలికి క్రేజ్‌ …????

bahubali jewellery designs viral in social media - Sakshi

బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయిన సినిమాల పేర్లతో చీరలు, డ్రెస్‌లు రావడం కొత్తేమి కాదు. హీరోయిన్‌, హీరోల పేర్లతో వస్త్ర వ్యాపారులు మార్కెట్‌ క్యాచ్‌ చేసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను జ్యూవెల్లరి వ్యాపారులు సైతం అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ సాధించిన బాహుబలి సినిమా పేరుతో ఆభరణాలను తయారు చేసి మార్కెట్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాలోని కీలక ఘట్టాలను తీసుకొని లాకెట్‌లు గా మార్చేస్తున్నారు.

శివగామి, బాల బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సీన్, బాహుబలి 2లో అత్యంత పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగును ఎక్కే సీన్. అలాగే సింహాసనంపై బాహుబలి కూర్చున్న దృశ్యాలను లాకెట్ లుగా మార్కెట్‌లో తీసుకొస్తున్నారు.  టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ టైపులోనే కళాకారులు ఈ బాహుబలి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.