ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండి..సిరిసిల్ల నియోజకవర్గ సత్తా చాటండి….చెన్నూరు ఏం ఎల్ ఎ బాల్క సుమన్….

రాజన్న సిరిసిల్ల జిల్లా, టి రిపోర్టర్(సంపత్ పంజ):-

IMG-20190314-WA0319

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17 న కరీంనగర్ లో ఏర్పాటు చేసిన టి ఆర్ ఎస్ బారి బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని,సభను విజయవంతం చేసి సిరిసిల్ల నియోజకవర్గ సత్తా ఏమిటో చూపాలని,చెన్నూరు ఏం ఎల్ ఎ బాల్క సుమన్ అన్నారు.

IMG-20190314-WA0317

గురువారం రోజున సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిపేట్, గంభీరావు పెట్ మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చెందర్, సుమన్ హాజరయ్యారు.

IMG-20190314-WA0312

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం కె టి ఆర్ ఇక్కడ ఎమ్మెల్యే కావడమని అన్నారు.సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ రాష్ట్రాలొనే టి ఆర్ ఎస్ పార్టీని ముందుకు తీసుకెళుతు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సాధిస్తున్న కె టి ఆర్ రాష్ట్ర ప్రజలతో పాటు సిరిసిల్ల ప్రజలకు అందిన అదృష్టం అని కొనియాడారు. ముఖ్యమంత్రి సభకు సిరిసిల్ల నుండి50,000 మందిని తరలించి సత్తా చాటాలని,అన్నారు.పార్లమెంట్ సభ్యులు గా వినోద్ కుమార్ చేసిన సేవలు గుర్తించి మళ్ళీ పార్లమెంట్ కు పంపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి అగయ్య, ఏం పి పి ఎల్లసాని సుజాత,ఎల్లారెడ్డిపేట్ సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి, ఆకునూరు శంకరయ్య, చీటి నర్సింగ రావు,స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…