మున్సిపల్ కమిషనర్ కు సన్మానం:

కోరుట్ల,
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి వాణి ఫిర్యాజిగూడ మున్సిపాలిటీ కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంలో… కోరుట్ల మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు ఆమెకు సన్మానం చేసి, అభినందనలు తెలిపారు.
02MAHILA COUNCILARS (2)
గత ఐదు సంవత్సరాలుగా కోరుట్ల మున్సిపల్ అభివృద్ధి లో భాగస్వామ్యమై, అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారని, ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేసి, శ్రీమతి వాణికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు శ్రీమతి ఆడెపు కమల,శ్రీమతి కస్తూరి వాణి,  శ్రీమతి గుండోజి మహేశ్వరి, శ్రీమతి శ్రీపాద వసంతరాణి  పాల్గొన్నారు.