యాక్ట్ ఫైబ‌ర్‌నెట్ …. ఫీల్ ది అడ్వాంటేజ్

ప్ర‌ముఖ బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ యాక్ట్ ఫైబ‌ర్‌నెట్ త‌న లోగోను మార్చింది. ఫీల్ ది అడ్వాంటేజ్ అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో త‌న నూత‌న లోగోను ఆ కంపెనీ  విడుద‌ల చేసింది.

ACT-Fibernet

ఇక త‌న సేవ‌ల ప‌రిధిని కూడా యాక్ట్ ఫైబ‌ర్‌నెట్ మ‌రింత విస్తృతం చేస్తున్న‌ట్లు తెలిపింది. యాక్ట్ అడ్వాంటేజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌ర్వీస్ కింద జీ5, సోనీ లివ్ సేవ‌ల‌ను యాక్ట్ ఫైబ‌ర్‌నెట్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అందివ్వ‌నుంది.

అలాగే అడ్వాండేజ్ గేమింగ్ కింద క్వాలిటీ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను, అడ్వాంటేజ్ స్పీడ్ స‌ర్వీస్ కింద హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను, అడ్వాంటేజ్ స్మార్ట్ సిటీస్ కింద బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై, వైజాగ్‌ల‌లో 5వేల‌కు పైగా వైఫై హాట్ స్పాట్‌ల‌ను యాక్ట్ ఫైబ‌ర్ నెట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అలాగే యాక్ట్‌ అడ్వాండేట్ క‌మ్యూనిటీ కింద చెన్నై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌లో ప‌బ్లిక్ లైబ్ర‌రీలు, స్కూళ్ల‌లో ఉచిత వైఫై క‌నెక్టివిటీని యాక్ట్ ఫైబ‌ర్ నెట్ అందివ్వ‌నుంది.