రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ ధర్నా,రాస్తారోకో.

www.telaganareporter.news-9394328296.✍

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ ధర్నా,రాస్తారోకో.

రాస్తారోకో చేస్తున్న ఖని కాంగ్రెస్ శ్రేణులు..
              రాస్తారోకో చేస్తున్న ఖని కాంగ్రెస్ శ్రేణులు..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, మే-26,తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-దేశంలో మోడీ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్తూ మోసం చేస్తోందని రామగుండం కాంగ్రెస్ నేతలు కాల్వలింగస్వామి,మక్కన్ సింగ్, బడికెల రాజలింగం ఆరోపించారు..IMG-20180526-WA0070

ఈ మేరకు శనివారం రామగుండం కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో రాజీవ్ రహదారిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ,నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె తిప్పేంత వరకు పోరాటాలు చేస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రజల్లోకి వెళ్తామన్నారు..
రాస్తారోకో తో రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.వెoటనే చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు..
ఈ రాస్తారోకోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాకాళి స్వామి, బొమ్మక రాజేష్, కొలిపాక సుజాత, బొంతల రాజేష్, పెద్దెల్లి ప్రకాశ్,తానిపర్తి గోపాలరావు,ముస్తఫా,తిప్పారపు శ్రీను, పీక అరుణ్ కుమార్, గుపుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు..