రామగుండం కమిషనరేట్ లో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య పరీక్షలు ..

www.telaganareporter.news✍9394328296

రామగుండం కమిషనరేట్ లో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య పరీక్షలు ..

హెల్త్ క్యాంపు ప్రారంభిస్తున్న రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్
హెల్త్ క్యాంపు ప్రారంభిస్తున్న రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఆగస్టు-8, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలకు బుదవారం గోదావరిఖని హెడ్ క్వాటర్ లో ఉచిత ఆరోగ్య పరీక్షలు  నిర్వహించారు.. IMG-20180808-WA0011

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్ జీత్ దుగ్గల్ చేతుల మీదుగా మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు..
ఈ సందర్భంగా సిపి దుగ్గల్ మాట్లాడుతూ… పోలీసు సిబ్బంది వారి కుటుంబాల ఆరోగ్యాల కోసం మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి పోలీస్ కుటుంబం సద్వినియొగం చేసుకొవాలని కోరారు.. అదేవిదంగా భవిష్తతులో కుడా ఇలాంటి కార్యక్రమ లను నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు.. అలాగే పోలిస్ సిబ్బందికి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి లొ ఆరోగ్యంకై  వివిధ పరీక్షలు చేపించడం జరుగుతుందన్నారు..

IMG-20180808-WA0010ఈ మెగా హెల్త్ లో పలువురు డాక్టర్లు  పాల్గొన్నారు.. ఇందులో డాక్టర్ రాజీవ్. కార్డియాలజిస్ట్, Dr. వంశీ కృష్ణ న్యారో వైద్యుడు, డి.వీర రెడ్డి ఆర్థోపెడిక్స్, D.జయొతి జనరల్ మెడిసిన్,
మేనేజర్ ఆర్.విజయ సారథి లు పాల్గొని 2 జిల్లాల పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు..

నిర్వహించిన పరిక్షలు:-
1)2D ఎకో
3) ACTR4 సౌండ్
4) BP (4255)
5) షుగర్, బిపి చెకప్…

IMG-20180808-WA0009
ఈ కార్యక్రమం లో పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్, అదనపు డిసిపి లా & ఆర్డర్ రవి కుమార్, ఎఎర్ అదనపు డిసిపి ప్రవీణ్ కుమార్, అదనపు డిసిపి నిర్వాహకుడు అశోక్ కుమార్, గోదావరికోని ఏసీపీ రక్షిత కె మూర్తి, జైపూర్ ఎసిపి సీతారామములు, సి ఎస్బి ఎసిపి రమేష్ బాబు, ఏసీపీ సిసిఎస్ చంద్రయుడు, ఏ ఆర్ ఎసిపి నాగేంద్రుడు, ఆర్ఐ సుందర్ రావు, ఆర్ఐఎం ఎంటీఓ మధుకర్, వెoకట్, అంజన్న, రామగుండం పోలిస్ కమిషనరేట్ పోలిస్ సంఘo అద్యక్షులు బోర్లకుంట పొచలింగం సిబ్బంది పాల్గొన్నారు…

బుధవారం జరిగిన మెగా హెల్త్ క్యాంప్ లో 395 మంది  పోలీస్, మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నట్లు పీఆర్ ఓ ప్రవీణ్ తెలిపారు..