రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం..

       www.telaganareporter.news✍9394328296

 

IMG-20180706-WA0025రామగుండం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం..
👉పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన కు పలువురు కార్పొరేటర్లు అందించిన అవిశ్వాసం వినతి పత్రం..

IMG-20180706-WA0055

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, జులై-6,తెలంగాణ రిపోర్టర్-(దినేష్):- ఎట్టకేలకు రామగుండం పాలక వర్గం లోని పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ పై అవిశ్వాసం కోసం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు..శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను రామగుండం కార్పొరేటర్లు కలిసి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ పై అవిశ్వాస తీర్మాన ప్రతిని సమర్పించారు.. రామగుండం నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అమడదురంలో ఈ ప్రాంతాన్ని ఉంచి, పరిపాలన కుంటుపడే విధంగా వ్యవహరిస్తూ, దానార్జనే ద్యేయంగా అక్రమాలకు పాల్పడుతూ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాడని, గడిచిన 4 ఏండ్లలో 3 సాదారణ సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రజల సమస్యలపై నిర్లక్ష్యనికి నిదర్శనం అని, స్టాoడింగ్ కమిటీ మేయర్ స్వార్ధం కోసం వాడుకొo టూ, కాంట్రాక్టర్లతో కుమ్ము కై ఒక నియంతలా వ్యవహరిస్తున్న తీరుతో ఉన్న మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పై విశ్వాసం కోల్పోయామని పలువురు స్వపక్ష, ప్రతిపక్ష కార్పొరేటర్లు అవిశ్వాస వినతి పత్రాన్ని కలెక్టర్ దేవసేన కు వినతిపత్రాన్ని అందించారు..

IMG-20180706-WA0043

👉దీంతో స్వపక్షo లో ఇన్ని రోజులుగా ఉన్న వర్గపోరులో మేయర్ అవిశ్వాసం తో ఒక్క గూటికి చేరుకొన్నట్లు తెలుస్తోంది..

IMG-20180706-WA0044

అలాగే డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ మేయర్ లక్ష్మీనారాయణకు అనుకులంగా ఉంటూ మేయర్ చేస్తున్న అవినీతి కి సపోర్ట్ చేస్తున్నాడని,పలు రకాల ఆరోపణలతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాస వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందించారు..