రామగుండం సిపి గా బాధ్యతలు తీసుకొన్న వి.సత్యనారాయణ(IPS)

www.telaganareporter.news9394328296

IMG-20180926-WA0024

రామగుండం సిపి గా బాధ్యతలు తీసుకొన్న వి.సత్యనారాయణ(IPS)

👉శాంతి బద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించలేదు…

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, సెప్టెంబర్-26, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ గా వి.సత్యనారయణ ఐ.పి.ఎస్ బాధ్యతలు తీసుకొన్నారు... ఈ సందర్బంగా బుదవారం రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయం నందు పోలీసు స్వాగత గౌరవవందనం స్వీకరించారు..

IMG-20180926-WA0022

సిపి గా భాద్యతలు చేపట్టిన వి .సత్యనారయణ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ..

కమిషనరేట్ పరిధిలో రెండు జిల్లాల పోలీసు స్టేషన్లు కు పిర్యాదుదారులు పేద వారైనా ,ధనవంతులు ఎవరు వచ్చినా పోలీసు స్టేషన్ లో ఒకే రకమైన న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో పని చేస్తామని, తప్పుచేసే వాళ్లకు పోలీసులు ఉన్నారనే భయాన్ని, మోసపోయిన వారికి పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని కలగజేయడమే పోలీసు ముఖ్య ఉద్దేశ్యoగా పనిచేస్తాం అన్నారు..

IMG-20180926-WA0021

గతం లో కొనసాగుతున్న పోలీసింగ్ ను అలాగే కొనసాగిస్తూ మహిళల భద్రత , నేర నియంత్రణకు మరింత చర్యలు తీసుకుంటామని, రెండు జిల్లాలో పోలీస్ నుండి ప్రజల ఆశిస్తున్న అంచనాలను చేరుకుంటామని ,ప్రజల యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజల రక్షణకు నిరంతరం కష్టపడి పని చేస్తాం అని తెలిపారు…. ఇక్కడ పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు మంచి వారన్నారు, DGP  M. మహేందర్ రెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ కి తెలంగాణ రాష్టంలో పెద్దపీట వేయడం జరిగిందని, వారి ఆలోచనల అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు . దీనిలో బాగంగా ప్రజల యొక్క ఆత్మ గౌరవం కాపడడం వారితో మర్యాదగా ప్రవర్తించటం పోలీసుల నుండి మొదలు చేయడం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుల వారి పట్ల మర్యాదగా ప్రవర్తించడం, మాట్లాడడం కించపరిచే విదంగా మాట్లాడడం కొంత మంది పోలీస్ కి సంబందించిన విషయం కాదని తెలువక వారు పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ ను చికాకు పరచిన వారి పట్ల కోపంగా చికాకుగా ప్రవర్తించక వారికి ఓపికగా మర్యాదగా తెలియపరచాలని, వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదన్నారు…  

IMG-20180926-WA0020అలా ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిదంగా ఫ్రెండ్లీ పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కొంతమంది వేరే విదంగా అర్ధం చేసుకుంటున్నారు అన్నారు. ప్రజల యొక్క భద్రత కోసం పనిచేస్తూ వారిని బద్రత కోసం బాగాస్వామ్యులను చెయడం జరుగుతుందన్నారు.. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, నేరస్తులకు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ సంబంధం లేదని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నేర్రస్తుల కోసం కాదని, వారిని చట్టo ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు… వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల శాంతి బద్రత, వారి ఆత్మ గౌరవం కాపాడుటమే ముఖ్య ఉద్దేశ్యం అని, నేరాలకు పాల్పడేవారిని, శాంతి బద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించలేదు… కమిషనరేట్ పరిది అభివృద్ధి పథాన నడిచేందుకుగానూ, శాంతిభద్రతల పరిరక్షణ కొరకు పోలీసు శాఖ మనఃస్ఫూర్తిగా తన వంతు కృషి చేస్తుందని అన్నారు.

IMG_20180926_191028

 

IMG-20180926-WA0025ఎన్టిపిసిలోని మిలినియం హల్ లో రామగుండం కమిషనరేట్ డిసిపి లతో కలిసి కమిషనరేట్ పరిధిలో ఉన్న సీఐ లు, ఎస్ఐ లతో సిపి సత్యనారాయణ సమావేశం నిర్వహించారు..  ఫిర్యాదుల పట్ల అలసత్వo చూపవద్దని అన్నారు..  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణముగా పని చేయాలని అధికారులను ఆదేశించారు..