“రుణం” సంగీత దర్శకుడు మల్లిక్ తేజ కు తెలంగాణ రిపోర్టర్ అభినందనలు..

జగిత్యాల జిల్లా : ఏప్రిల్ 12: తెలంగాణ రిపోర్టర్…


శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ‘రుణం’ తెలుగు సినిమా కు మొదటిసారిగా జగిత్యాల కు చెందిన జానపద కళాకారుడు, గాయకుడు మల్లిక్ తేజ సంగీత దర్శకత్వం వహించాడు.

IMG-20190412-WA0419__01

స్థానిక దుర్గ కళామందిర్ థియేటర్ లో ‘ రుణం ‘ సినిమా విడుదలైంది.ఈ సందర్భంలో…థియేటర్ ఆవరణలో ప్రదర్శనకు ముందుగా …మల్లిక్ తేజకు అభినందన కార్యక్రమం జరిగింది.

IMG_20190412_111458__01__01

ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ పాల్గొని, కేక్ కట్ చేసి మల్లిక్ తేజ ను అభినందించారు.

అలాగే, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటుగా టిఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, సిటికేబుల్ నిర్వాహకులు టివి సూర్యం, కళాశ్రీ సంస్థ నిర్వాహకులు గుండేటి రాజు, దుర్గ థియేటర్ యజమాని శ్రీనివాస్ గౌడ్ ,వర్ధమాన గాయకురాలు కుమారి మౌనిక తదితరులు పాల్గొని, మొదటిసారిగా తెలుగు సినిమా కు సంగీత దర్శకత్వం వహించిన మల్లిక్ తేజకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ… జగిత్యాల ప్రాంతంనుండి మొదలైన సాంస్కృతిక వారసత్వం నుండి చిన్నాపూర్ (ధర్మపురి) గ్రామంకు చెందిన మల్లిక్ తేజ తెలుగు చలనచిత్ర రంగంలో ఎదగాలన్నారు…