రౌడీ షీటర్లు తప్పు చేస్తే పిడి యాక్ట్ పెడుతాం..రామగుండం సిపి సత్యనారాయణ

 

IMG-20181010-WA0019www.telaganareporter.news..✍9394328296..

రౌడీ షీటర్లు తప్పు చేస్తే పిడి యాక్ట్ పెడుతాం..రామగుండం సిపి సత్యనారాయణ..

👉అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సత్ప్రవర్తనకై రామగుండం కమీషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన సిపి సత్యనారాయణ..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, అక్టోబర్-10, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-

రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలలో పలు నేరాలకు పాల్పడి కేసులలో ఉన్న రౌడీ షీటర్ల కు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కౌన్సిలింగ్ చేశారు.. ఈ సందర్భంగా బుదవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కార్యక్రమంలో రామగుండం సిపి సత్యనారాయణ రౌడీషీటర్లు చేసిన నేరాలపై, కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు… రౌడీ షీటర్లు ఇక ముందు చట్ట వ్యతిరేక సంఘటనలకు పాల్పడితే  పిడి యాక్ట్ కేసులను పెడతామని హెచ్చరించారు..

IMG-20181010-WA0017
ప్రతీ ఒక్క రౌడీ షీటర్ వారి వివరాలు, మరియు కుటుంబాల వివరాలు మరియు వారి స్నేహితుల వివరాలు, చేసిన నేరాల వివరాలు, వారు చేసిన చివరి నేరం, ప్రస్తుతం వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది..

👉రామగుండం కమీషనరేట్ పరిధి లోని పెద్దపల్లి ,మంచిర్యాల జిల్లాల పరిధిలోని రౌడీ షీటర్లకు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ లో భాగంగా సిపి మాట్లాడుతూ… 

IMG-20181010-WA0018రామగుండం కమీషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 319 మంది రౌడీషీటర్ల పై హిస్టరీ షీట్స్ మైంటైన్ చేస్తున్నామన్నారు.. ఎన్నికల కోడ్ ప్రక్రియ నేపద్యంలో ఎన్నికల సందర్బంగా ఎటువంటి గొడవలు సృష్టించడం గాని, వేరే వ్యక్తులను రెచ్చగొట్టడం వంటివి చేయకూడదని శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్చకు భంగం కలిగేలాగా ప్రవర్తించ కూడదని శాంతిభద్రతల పరిరక్షణలో రాజి పడేది లేదని, ఎన్నికల సందర్బంగా పట్టణాలలో, గ్రామాలలో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, వర్గాలను రెచ్చకోట్టడం వంటివి చేయకూడదన్నారు.. ఎన్నికల ముందుగాని, ఎన్నికల రోజుగాని, ఎన్నికల తరువాతగాని ఎలాంటి గొడవలు, అల్లర్లు, ఆవాంచనీయ సంఘటనలకు పాల్పడితే.. ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని మరియు చట్టరీత్య కఠీన చర్యలు తీసుకోబడునని, నేరస్తుల కదలికలపై పూర్తి నిఘా పెంచడం జరుగుతుందన్నారు.. సాధారణ ప్రజల లాగా రౌడీ షీటర్లకు వారి కదలికల ఫై మరియు కార్యకలాపాలకు పూర్తి స్వేచ్చ ఉండదని, చట్టప్రకారంగా వారి కదలికల పై కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగేస్తే కఠిన చర్యలు తీసుకొవడం జరుగుతుందని, తీవ్రతరమైన నేరాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలలో ఉపేక్షించేది లేదని అన్నారు.. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం నెలకొల్పి, నేరాల నియంత్రణే లక్ష్యంగా ముందుకు సాగుతాం అన్నారు.. సివిల్ పంచాయితీలలో, భూ పంచాయితీల విషయాలలో కలుగ చేసుకోని బెదిరింపులకు పాల్పడడాలు, ఎక్కడైన నేరాలకు పాల్పడిన, మహిళలపై వేధింపులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని, అలాంటివారిపై పిడి యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ హాజరు కాని రౌడీ షీటర్ల 3 రోజులలో సంబంధిత అధికారులముందు హాజరు కావాలన్నారు. కమీషనరేట్ పరిదిలో పోలీస్ స్టేషన్ ల వారిగా జాబితా తయరు చేయడం జరిగిందని, వారి కదలికలపై పూర్తి నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే కాలంలో రౌడీ షీటర్ల పై పెట్టి కేసు నమోదైన పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. యం. రవి కుమార్, అదనపు డి.సి.పి. (లా & ఆర్డర్) గారి నేతృత్రంలో రౌడి షీటర్ల కదలికలను తెలుకొనుటకు గాను (4) ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చూస్తున్నట్లు తెలిపారు..

IMG-20181010-WA0020

చట్ట వ్యతరేక కార్యకలాపాలకు పాల్పడకుండా అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సత్ప్రవర్తన కలిగి ఉంటామని రౌడీ షీటర్ల తో ప్రతిజ్ఞ చేపించారు.
👉రామగుండము కమీషనరేట్ పరిధి లో రౌడీ షీటర్ల సంఖ్య :319
పెద్దపల్లి జిల్లా పరిధిలో రౌడీ షీటర్ల సంఖ్య :144
మంచిర్యాల జిల్లా పరిధిలో రౌడీ షీటర్ల సంఖ్య:175
చనిపోయిన రౌడీ షీటర్ల సంఖ్య : 04
ఇప్పటి వరకు రామగుండము కమీషనరేట్ పరిధి లో బoడోవర్ చేసిన రౌడీ షీటర్ల సంఖ్య:187
కౌన్సిలింగ్ హాజరైన రౌడీ షీటర్ల సంఖ్య:206
కౌన్సిలింగ్ హాజరు కాని రౌడీ షీటర్ల సంఖ్య:74

IMG-20181010-WA0024ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఎం.వేణుగోపాల్ రావు, పెద్దపల్లి డిసిపి టి. సుదర్శన్ గౌడ్, అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎన్.అశోక్ కుమార్, అడిషనల్ డిసిపి లా & ఆర్డర్ రవి కుమార్, ఎఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, రెండు జిల్లాలోని సిఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు…