వద్దు వద్దు Ocp-5 వద్దు..ఖని కాంగ్రెస్ ధర్నా

www.telaganareporter.news✍9494328296..

ధర్నా లో కాంగ్రెస్ శ్రేణులు
ధర్నా లో కాంగ్రెస్ శ్రేణులు

వద్దు వద్దు Ocp-5 వద్దు..
ఖని కాంగ్రెస్ ధర్నా..

పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని, మార్చి-7, తెలంగాణ రిపోర్టర్:-
తెలంగాణ సింగరేణి లో ఓపెన్ కాస్ట్ లు లేకుండా చేస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఓసీపీ లను ప్రారంభించే ప్రయత్నం చేయడాన్ని ఖని కాంగ్రెస్ ఆందోళనకు సిద్ధం అయింది.. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..

IMG_20190307_124719తెలంగాణ ను బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్బాలు పలికి గద్దె నెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం  సింగరేణి లో నూతన ఓసీపీ ల తీరుపై అనుసరిస్తున్న విధానాలపై మాట మార్చిoదని ఆరోపించారు.. సింగరేణి ఆర్జి-1 లోని 5 వ అండర్ గ్రౌండ్ ను మూసివేసి ఉపరితల బొగ్గుగని ని ప్రారంభించే ప్రయత్నం చేస్తుందన్నారు.. ఉపరితల బొగ్గుగనులు(ocp) లు ప్రారంభించడం వలన ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజా జీవనానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీపీ ల వలన ఇప్పటికే అత్యధిక బ్లాస్టింగ్ తో పొల్యూషన్ ఏర్పడంతో పాటు ఇండ్లన్నీ బీటలు పడి కూలిపోతున్నాయని, ఆలాగే  బ్లాస్టింగ్ వలన వచ్చే దుమ్ము,దూళితో ప్రజల ఆరోగ్యాలు చేడిపోయి ఆసుపత్రుల పాలవుతున్నారని, దీనివలన భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాక,  ముఖ్యంగా గర్భిణీలకు, చిన్నారులకు, వృద్దులకు ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు.. పోరాటాల పురిటి గడ్డ లా పేరున్న రామగుండం లో సింగరేణి చేపట్టే  ఓసీపీ-5 కి వ్యతిరేకంగా పోరాడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు..

IMG-20190307-WA0016ఈ కార్యక్రమంలో రామగుండo నియోజకవర్గ నాయకులు మాక్కాన్ సింగ్, బడికల రాజలింగo, పెద్దెల్లి ప్రకాష్, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు తానిపర్తి గోపాలరావు, బొంతల రాజేష్, మాహాoకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాష్, వంగ శ్రీను, డొంతుల లింగం,పిచర శ్రీనివాస్,బొమ్మక శైలజ, పద్మాలత,ముస్తఫా, గోలివాడ ప్రసన్న కుమార్,పీక అరుణ్ కుమార్, యుగేందర్, ఫక్రుద్దీన్, దాసరి సావిత్రి, గాధం నందు, విజయలతో ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు..IMG_20190307_125157

సమావేశ అనంతరం స్థానిక 5 వ గని ముందు గల ప్రధాన రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు, ఆయా డివిజన్ల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు..