వింత జంతువుకు జన్మనిచ్చిన సబ్సిడీ గొర్రె …

born strange animal to sheep

మెదక్‌: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఓ గొర్రె వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మెదక్‌ మండలం ర్యాలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జంతువును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు తరలివచ్చారు. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గొర్రెల పథకంతొ గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే.