స్ట్రీమ్‌ టీవీ 4కె పేరిట నూతన ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ విడుదల

 

ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యాక్ట్‌ ఫైబర్‌నెట్‌  భారత మార్కెట్‌లో యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కె పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను విడుదల చేసింది.

act-stream-tv-4k

ఇందులో ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. 2జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఈథర్‌నెట్‌ పోర్టు, 1 హెచ్‌డీఎంఐ పోర్టు, 1 ఏవీ అవుట్‌పుట్‌, 1 ఎస్‌డీ కార్డు స్లాట్‌ తదితర ఫీచర్లను ఈ బాక్స్‌లో అందిస్తున్నారు.

దీని ద్వారా వీక్షకులు టీవీలో తమ ఫేవరెట్‌ వీడియోలు, సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్‌ వీడియోలను వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌ స్టార్‌, సోనీ లివ్‌, హూక్‌, జీ5, యూట్యూబ్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ తదితర యాప్‌లకు ఈ బాక్స్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీంతో ఆయా యాప్‌ల నుంచి వీడియోలను స్ట్రీమ్‌ చేస్తూ వీక్షించవచ్చు.

ఇక ఈ యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కె బాక్స్‌ రూ.4499 ధరకు వినియోగదారులకు మే నెలలో లభ్యం కానుంది. కాగా యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడుతున్న ఎంపిక చేసిన 5వేల మంది వినియోగదారులకు ఈ బాక్స్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. అందుకు గాను యాక్ట్‌ కార్ప్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ లో వినియోగదారులు రిజస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.