హనుమాన్ రథయాత్ర

శేరిలింగంపల్లి: april 19,  తెలంగాణ రిపోర్టర్.న్యూస్,T.Anand Goud


హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ హనుమాన్ ఆలయం నుంచి శుక్రవారం హనుమాన్ రథయాత్ర, పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు‌.
IMG-20190419-WA0262
ఈ శోభాయమాన రథయాత్రను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాషాయపు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ రథయాత్ర లో చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ రావు, బీజేపీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, శివసేన నాయకులు కేశవ్ తో పాటు పుట్ట వినయ్, నాగపురి మహేష్ యాదవ్, గోపాల్, సాయి, తదితరులు ఉన్నారు. అనంతరం‌ దూబేకాలనీలోని హనుమాన్ దేవాలయంలో‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area