హోరెత్తించిన ‘రాజ్ ఠాకూర్’ ర్యాలీ

IMG-20181119-WA0024www.telagangareporter.news✍9394328296.

హోరెత్తించిన ‘రాజ్ ఠాకూర్’ ర్యాలీ..
– 15,000 మందితో భారీ ర్యాలీ,
ర్యాలీ లో పాల్గొన్న మాజీ మంత్రి, గద్దర్, హర్కర వేణు గోపాల్, శివాజీ రెడ్డి, …

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, నవంబర్-19,  తెలంగాణ రిపోర్టర్ :– రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ భారీ ర్యాలీని నిర్వహించారు. సోమవారం సుందిల్లా గ్రామంలో ని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలు దాదాపు 15,000 మందితో భారీ ర్యాలీని విట్టల్ నగర్ పార్క్ నుంచి తిలకనగర్, రమేష్ నగర్, ఎల్బీనగర్ వీధుల గుండా తిరుగుతూ ప్రధాన చౌరస్తా కు చేరుకోగా ఆ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక శైలజ రాజేష్ లు మహిళలలతో ఘన స్వాగతం పలికారు.. ఈ ర్యాలీ లో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, హర్కర వేణు గోపాల్, గద్దర్, హాస్య నటుడు శివాజీ రెడ్డిలు పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రధాన చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రాంత ఎమ్మెల్ల్ల్వై అభ్యర్థి గా ఓటు వేసి గెలిపించాలని కోరారు..