ధర్మపురి కి బ్రహ్మోత్సవ శోభ….17 నుంచి 29 వరకు కు ఉత్సవాలు

ధర్మపురి, 15 మార్చి 2019, తెలంగాణ రిపోర్టర్,

డా. మధు మహాదేవ శర్మ


dharmapuri-sri-laxmi-nrusimha-swamy-1024x683
•హాజరుకానున్న సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖా మాత్యులు
•ఏర్పాట్లలో ఆలయ పాలకవర్గం జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం
IMG-20190315-WA0449
ధర్మపురి లో ఈ నెల 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా దేవస్థానం పరిధిలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.
swamy wari brahmotsavamula invitation to cm kcr
(swamy wari brahmotsavamula invitation to cm kcr)
గోదావరి తీర ప్రాంతాల్లో పురవీధుల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుండగా ఆలయ గోపురాలు విద్యుద్దీపాలంకరణ చేపట్టారు గోదావరి తీరంలో భక్తులు విడిది చేయడానికి పెద్ద చెట్లను ఏర్పాటు చేస్తున్నారు అలాగే మంగలి గడ్డ పుష్కర ఘాట్ల వద్ద సంతోషిమాత పుష్కరఘాట్ వద్ద వేర్వేరుగా తాత్కాలిక చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు వీటిలో భక్తులు తాత్కాలికంగా విడిది చేసే అవకాశం ఉంది.
IMG-20190315-WA0352

ధర్మపురి క్షేత్ర చరిత్ర

తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో నవ నారసింహ క్షేత్రాల్లో దక్షిణ కాశి గా పేరుపొందిన ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం ప్రత్యేకంగా తన ప్రతిష్టను చాటుకొనుచున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుదీరిన త్రిమూర్తి క్షేత్రంగా హరిహర క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుండి సనాతన సంప్రదాయాలకు వైదిక శాస్త్ర ఆగమ వేద విద్య అధ్యయన వేదిక గా ఎంతో కీర్తి గడించింది
ఈ క్షేత్రమును పూర్వం ధర్మవర్మ అ అనే మహారాజు పరిపాలించిన వలన ఈ క్షేత్రానికి ధర్మపురి అను పేరు వచ్చినది స్థానిక ఇతిహాస వలన తెలియుచున్నది. సమస్త ప్రజల భక్తుల మనోభీష్టములను ఇక్కడ లక్ష్మీనరసింహుడు నెరవేర్చు చున్నాడని పురాణాంతర్గత పృథు నారద సంవాదం వలన తెలియుచున్నది
ఈ క్షేత్రం క్రీస్తు శకం 850 -928 వ సంవత్సర కాలం కంటే పూర్వం నుండి ది అని అని,కాలక్రమంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు క్షేత్ర చరిత్ర ఆధారంగా తెలియ వచ్చుచున్నది ఈ క్షేత్రంలో ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహిని గా
ప్రవహించుచు న్నoదున ఈ క్షేత్రం దక్షిణకాశీగా మరియు తీర్థరాజముగా వెలుగొందుచున్నది
ఎక్కడా లేని విధంగా త్రిమూర్తి క్షేత్రంగా అలరారుచున్నది
ఈ ఆలయ ప్రాంగణంలో భారత దేశంలో ఎక్కడాలేని విధంగా యమ ధర్మ రాజు విగ్రహం అం మనకు సాక్షాత్కరిస్తుంది. ప్రతి నెల భరణి నక్షత్రం రోజున యమధర్మరాజు వారికి ప్రత్యేక అభిషేక అర్చన విశేష పుష్పాది సేవలతో అపమృత్యు దోషం నివారణ కొరకు విశేష పూజలు నిర్వహించబడతాయి
ప్రాచీన క్షేత్రముగా గా ప్రముఖ చరిత్ర నేపథ్యం కలిగిన ఈ ధర్మపురి క్షేత్రం వేదములకు ప్రాచీన సంస్కృతికి సంగీతానికి సాహిత్యానికి కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందినది
ఈ ధర్మపురి క్షేత్రంలో దాదాపు 2 ఎకరముల విస్తీర్ణం ఉన్న బ్రహ్మ పుష్కరిణి కోనేరు గా పిలవబడే
తటాకము కలదు. పూర్తి రాతి కట్టడము గా నిర్మించబడిన ఈ బ్రహ్మ పుష్కరిణి చూసి తరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అశేష భక్త జనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి కి రావడం ఆనవాయితీ.
అనేక ప్రాచీన దేవాలయాలు కల ధర్మపురి క్షేత్ర మున ప్రధానముగా ఇసుక స్తంభముగా పిలవబడే సత్యవతి దేవాలయము, గౌతమ మహర్షి చేత స్థాపించబడిన లింగం కల గౌతమేశ్వరాలయం అతి ముఖ్యమైనవి. దక్షిణ వాహినిగా ప్రవహించే గోదావరి నది లో బ్రహ్మ గుండము సత్యవతి గుండం యమ గుండం చక్ర గుండములు పాల గుండములు అతి పవిత్ర స్నాన వేదికలుగా అత్యంత లోతైన ఇవి గా సుప్రసిద్ధములు.
కానీ నేడు గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా ఈ గుండములు నీటిలోనే మునిగి పోయి ఉన్నవి
.

ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు….

IMG-20190315-WA0448

17వ తేదీ పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున అంకురార్పణ కలశ స్థాపన వరాహ తీర్థము పుట్ట బంగారం కార్యక్రమాలు ఉంటాయి
సాయంత్రం వేళలో శ్రీ యోగ అ ఉగ్ర నరసింహ స్వామి లతోపాటు ఉ వెంకటేశ్వర స్వామి వారు భక్త జనుల తో కలిసి ఇ చింతామణి చెరువు కట్ట వద్దకు వెళ్లి పుట్ట బంగారాన్ని సేకరించే కార్యక్రమం
18వ తేదీన సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తమున దేవస్థానంలోని శేషప్ప కళా వేదిక పైన ముగ్గురు స్వాముల కళ్యాణోత్సవాలు
19వ తేదీన రాత్రి 7 గంటలకు మాడ వీధుల గుండా శ్రీ స్వామివారి ఊరేగింపు సేవ కళ్యాణ నరసింహుని ఊరేగింపు సేవ ఉత్సవం
20వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కు ఉత్సవాలు
బ్రహ్మ పుష్కరిణిలో స్వామివారికి కి నిర్వహించి డోలోత్సవం నిర్వహిస్తారు.
IMG-20190315-WA0444
21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్ర నరసింహ స్వామి వారికి కి బ్రహ్మ పుష్కరిణిలో తెప్పోత్సవము డోలోత్సవము.
IMG-20190315-WA0452
22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తెప్పోత్సవ డోలోత్సవం లతోపాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇ దక్షిణ యాత్ర
దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా స్వామి వారు  స్థానిక రక్షకభట నిల యాన్ని చేరుకొని తనిఖీలు నిర్వహించి విశేష పూజలు అందుకుంటారు
23వ తేదీన న శ్రీ యోగానంద ఉగ్ర నరసింహ స్వాముల ఉత్తర యాత్ర మరియు 7 గంటలకు భోగ మంటప ఉత్సవం నిర్వహించబడును
24వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దక్షిణ ఉత్తర యాత్రలు రాత్రి 8 గంటలకు వేద సదస్సు
25వ తేదీన నిత్య హోమములు బలిహరణం రాత్రి 8 గంటలకు దోపుకథ
26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి మూడు గంటలకు రథోత్సవం
రాత్రి 7 గంటలకు ముగ్గురు స్వాములకు చక్రతీర్థం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పుష్పయాగము
27 తేదీన రాత్రి 7 గంటలకు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం 9 గంటలకు యోగ స్వామి వారి  ఏకాంత ఉత్సవం
28వ తేదీన రాత్రి 7 గంటలకు ఉగ్ర స్వామివారి పుష్పయాగం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఏకాంత ఉత్సవం
29వ తేదీన రాత్రి e 9 గంటలకు ఉగ్ర స్వామివారి  ఏకాంత ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి
•భద్రాద్రి తరహాలో ధర్మపురి నరసన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ శరత్
IMG-20190315-WA0336
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి
బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భద్రాద్రి తరహాలో నిర్వహించుటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
రాష్ట్ర నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల్లోని కొన్ని వేల మందికి ఇక్కడి స్వామి కులదేవత కావడం తో బ్రహ్మోత్సవాల్లో భారీ సంఖ్యలో లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
-దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,  డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి అమరేందర్
స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా విచేయుచున్న అశేష భక్తులకు ఎటువంటి ఇ ఇబ్బంది కలగకుండా దేవస్థాన పక్షాన త్రాగునీటి వసతి చలువ పందిళ్ల నిర్మాణము ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మరియు ఈవో  తెలిపారు
ఇట్టి బ్రహ్మోత్సవాలలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి విచ్చేయుచున్న ట్లు ఆలయ వర్గాల సమాచారం
ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ తో పాటు ఉ దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొనేదరని
తెలియజేశారు
ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రెండుసార్లు ప్రత్యేక సమీక్ష సమన్వయ సమావేశాన్ని నిర్వహించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.